బ్యాటరీ పేలడంతో మహిళ మృతి

KDP: కడప జిల్లాలో బైక్ బ్యాటరీ పేలి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఎర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తిలో తెల్లవారుజామున స్కూటర్ ఛార్జింగ్ బ్యాటరీ పేలడంతో వెంకట లక్ష్మమ్మ గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె ఇంట్లో ఉండగ అకస్మాత్తుగా బ్యాటరీ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.