బాలికపై లైంగిక దాడి: ఫిజిక్స్ టీచర్‌కు 20 ఏళ్ల శిక్ష
AKP: బాలికను ప్రలోభపెట్టి ఇద్దరు పిల్లల జన్మకు కారణమైన కేసులో విశాఖపట్నం పోక్సో కోర్టు ఫిజిక్స్ టీచర్ తిరుపతిరావుకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015లో చోడవరంలోని ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న సమయంలో బాలికను అపహరించాడని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఛార్జిషీట్‌లోని ఆధారాలతో నేరం రుజువైందని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.