ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు
CTR: తవణంపల్లి మండలం అమరరాజ స్కూల్‌లో ఇవాళ సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్ పరిశీలించి, భద్రతా ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.