టోంకిని ఆలయానికి పోటెత్తిన భక్తులు
ASF: సిర్పూర్ (టీ) మండలంలోని టోంకిని ఆలయానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడంతో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.