రంగనాథ స్వామి ఆలయంలో స్నాపన తిరుమంజనం
WNP: శ్రీ రంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి ప్రయుక్త స్నాపన తిరుమల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీరంగనాథ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.