'బిల్లులు చెల్లించే వరకు పాలు పోయము'
BHNG: జిల్లాలో పాడిరైతులు పాల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ఆలేరు పట్టనంలోని పాల సొసైటీకి తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ జెల్లి నరసంహులు మాట్లాడుతూ.. 40 రైతులకు ఐదు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. బిల్లులు చెల్లించే వరకు పాలు పోయబోమని రైతులు స్పష్టం చేశారు.