'18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు'
NZB: ఈనెల 14, 17 తేదీల్లో రెండవ, మూడవ విడతల్లో జరగనున్న జీపీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆధార్ కార్డు, ఫోటోతో కూడిన ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును అనుమతిస్తామన్నారు.