'విద్యారంగా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది'

NGKL: విద్యా రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో విద్యార్థులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు.