బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్
WNP: బాల్య వివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదివారం తెలిపారు. అమ్మాయిలు 18 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు కచ్చితంగా చదివించాలన్నారు. 18 సంవత్సరాల లోపు పెండ్లి చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.