పెదభోగిల మాజీ సర్పంచ్ లంకరాములు మృతి

పెదభోగిల మాజీ సర్పంచ్ లంకరాములు మృతి

VZM: సీతానగరం మండల కేంద్రంలోని పెదభోగిల మేజర్ పంచాయతీ మాజీసర్పంచ్, వైసీపీ నేత లంక రాములు( 71) ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మూడురోజుల క్రితం అతన్ని పిల్లలు బెంగళూరులో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు.