రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు..!
PLD: సత్తెనపల్లి 10వ వార్డు పంచముఖ ఆంజనేయస్వామి గుడి వద్ద సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. కానీ మధ్యలో ఉన్న హైటెన్షన్ స్తంభాలను తొలగించకుండానే పనులు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, రైతులు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. వెంటనే ఆ స్తంభాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.