భూ కబ్జాలు, దౌర్జన్యాలు కట్టడి చేయండి: మేయర్
ATP: భూ కబ్జాలు, దౌర్జన్యాలను కట్టడి చేసి నగరంలో ప్రశాంతతను నెలకొల్పాలని మేయర్ మహమ్మద్ వసీం పోలీస్ అధికారులను కోరారు. అనంతపురంలో తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాయినగర్‌లో డబుల్ రిజిస్ట్రేషన్ ఆస్తి వివాదంలో అధికారులు స్పందించి వాస్తవాలు నిగ్గు తేల్చాలన్నారు. ఈ విషయంపై DSPకి ఫిర్యాదు చేసిన బాధితులపై దౌర్జన్యం చేశారన్నారు.