వెన్నునొప్పితో బాధపడుతూ మహిళ మృతి

వెన్నునొప్పితో బాధపడుతూ మహిళ మృతి

MLG: దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న 52 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందింది. గొల్లవాడకు చెందిన నునేటి వసంత ఏప్రిల్ 17న ఆత్మహత్యాయత్నం చేసింది. ములుగు నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు, అనంతరం వరంగల్ MGMకు తరలించగా చికిత్సలో ఉండగానే 21న మృతి చెందింది. కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.