బీజేపీ జనతా వారధి జోనల్ కార్యాలయం ప్రారంభం
VSP: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలనే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.