స్వగ్రామం చేరుకున్న రమేశ్ గౌడ్ మృతదేహం

JGL: కోరుట్ల మండలం యూసుఫ్ నగర్‌కి చెందిన బత్తిని రమేశ్ గౌడ్ (43) 4 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం బెహరాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రమేశ్ మనస్తాపంతో వారం కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది.