VIDEO: యువకుడిపై దాడి.. న్యాయం కోరిన తల్లిదండ్రులు
WGL: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పార్వతి–సత్యనారాయణలు తమ కుమారుడు భార్గవ్‌పై జరిగిన దాడిపై న్యాయం చేయాలని శనివారం డిమాండ్ చేశారు. ప్రహరీగోడ నిర్మాణ సమయంలో పక్కింటి వ్యక్తి గొడవపడి దాడి చేయడంతో భార్గవ్‌కు చెవి కర్ణభేరి పగిలిందని వైద్యులు తెలిపారు. ఫిర్యాదు చేసినా తమపైనే కేసు నమోదు చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.