బస్టాండ్‌ను తనిఖీ చేసిన జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

బస్టాండ్‌ను తనిఖీ చేసిన జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

KNR: కరీంనగర్ బస్టాండ్‌ను ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవికాలం దృష్ట్యా ప్రయాణీకులకు కల్పించిన మంచినీటి వసతి, బస్ స్టేషన్‌లోని ఫ్రీ, పెయిడ్ టాయిలెట్ల పరిశుభ్రతలను పరిశీలించారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని బస్టాండ్ సూపర్వైజర్ రామకృష్ణకు తగు సూచనలు చేశారు.