VIDEO: ఏటీఎం సహాయం పేరుతో రూ.40 వేల మోసం
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం ఓ రైతు మోసానికి గురయ్యాడు. ఏటీఎం వినియోగం తెలియక సహాయం కోరిన రైతు పిన్నింటి .కిషన్ రావు వద్ద దుండగుడు ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.