బ్రిడ్జిపై సమస్యలు పరిష్కరించాలని ధర్నా

బ్రిడ్జిపై సమస్యలు పరిష్కరించాలని ధర్నా

JN: జనగామ బ్రిడ్జిపై నెలకొన్న సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని సీపీఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుండి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వరకు రైల్వే క్రాసింగ్ కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిపై తక్షణం లైట్లు వేసి, రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.