ఆలూర్ మండల కేంద్రంలో ఘనంగా భోగి వేడుకలు

ఆలూర్ మండల కేంద్రంలో ఘనంగా భోగి వేడుకలు

NZB: ఆలూర్ మండల కేంద్రంలో భోగి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలూర్ గ్రామంపలు కాలనీలో ప్రజలు పెద్దఎత్తున భోగిమంటలు వెలిగించారు. ఉదయం నుంచి ఆడపడుచులు ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కీడు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. భోగిమంటల అనంతరం కాలనీలో నువ్వులు బెల్లం పంపిణీ చేశారు.