మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే బహిరంగ లేఖ

మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే బహిరంగ లేఖ

SRD: సింగూర్ ప్రాజెక్ట్ నీటి విడుదల పై స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే ఆదివారం బహిరంగ లేఖ రాశారు. మంజీరా డ్యామ్ విషయంలో అధికారులకు సరైన ఆదేశాలు అందడం లేదని వెల్లడించారు. నీరు అందక ​ఘన్ పూర్ ఆనకట్ట పరిధిలో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.