బస్సు పార్కింగ్‌లో చెలరేగిన మంటలు

బస్సు పార్కింగ్‌లో చెలరేగిన మంటలు

JN: ప్రైవేట్ బస్సు పార్కింగ్‌లో అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగిన ఘటన జనగామ పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం హన్మకొండ రోడ్డులోని దయనిలయం సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు పార్కింగ్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి పాత బస్సు టైర్లు మొత్తం కాలి బూడిద అయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వివరాలు తెలియాల్సి ఉంది.