మెరిసిన పేదింటి ఆణిముత్యం

మెరిసిన పేదింటి ఆణిముత్యం

KRNL: తుగ్గలి మండలం పైచెరువు తండా గ్రామానికి చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతుల కుమారుడు రఘు నాయక్ ఇటీవల విడుదలైన JEE మెయిన్స్‌లో 732వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి ఈ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.