సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్
సౌతాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. సౌతాఫ్రికా-'A'తో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్ ఫీల్డింగ్ చేస్తుండగా, అతని చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతడి గాయం టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది.