ఏడో రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె
SRPT: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరింది. హుజూర్‌నగర్ డివిజన్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడారు.