'అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలి'
MNCL: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జన్నారం మండల శాఖ అధికారి శ్రీనివాస్ కోరారు. బుధవారం జన్నారం మండలంలోని ధర్మారం ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. వేసవికాలంలో ఎండల తీవ్రతతో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలన్నారు.