ఎంఆర్‌సీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
సత్యసాయి: కదిరి బాలికల హైస్కూల్‌లో ఏపీ సమగ్ర శిక్ష నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎంఆర్‌సీ రీవెనోవెషన్ భవనాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.