వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
కోనసీమ: శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. స్వామివారిని అమ్మ వార్లను సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి రజిత సింహాసనంపై ఆశీనులను చేసి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.