భార్య మరణం తట్టుకోలేక భర్త గుండెపోటుతో మృతి

భార్య మరణం తట్టుకోలేక భర్త గుండెపోటుతో మృతి

MHBD: డోర్నకల్‌ పట్టణంలో గత వారం బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా భార్య మృతి చెందగా, ఆ విషాదాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు లోనైన భర్త శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. మానసిక ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో వరుసగా జరిగిన ఈ రెండు మరణాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.