మహిళ గొంతు కోసి దారుణంగా హత్య

మహిళ గొంతు కోసి దారుణంగా హత్య

మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.