సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. కఠిన చర్యలే: సీపీ

సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. కఠిన చర్యలే: సీపీ

SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 23 ఉదయం 6 గంటల నుంచి మే 8 ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించరాదని, అవసరమైతే సంబంధిత ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. డీజే సౌండ్ వినియోగంపై కూడా నిషేధం విధించినట్లు వెల్లడించారు.