తెనాలిలో ఆవుల సంచారంతో ట్రాఫిక్ సమస్యలు

GNTR: తెనాలిలో రోడ్లపై ఆవుల సంచారం ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణంగా మారింది. వాటి యజమానులు వాటిని పట్టించుకోకుండా వదిలేయడంతో, ఆహారం కోసం రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో సైతం రోడ్డు మధ్యలో ఇవి గుంపులుగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు శనివారం కోరారు.