తాగునీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయండి సారూ..!
KMM: ఇల్లెందు మండలంలోని బుగ్గవాగు వద్ద మిషన్ భగీరథ మెయిన్ పైప్‌లైన్ లీకై నీరు వృథా అవుతోంది. బలంగా ఎగిసే నీరు ఫౌంటెన్‌లా మారి తాగునీరు వృథా అవుతోంది. గతంలో కూడా ఇలాంటివి చోటు చేసుకున్నా శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పైప్‌లైన్ లీకేజీలను అరికట్టి, నీటి వృథాను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.