బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
ADB: తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన పుటకర వినోద్ రెడ్డి ఇటీవల ఆపరేషన్ చేసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం వారిని పలకరించి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఎమైన అవసరం ఉంటే నాకు తెలియజేయాలని కోరారు. వీరి వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.