100 మంది సినీ కార్మికులకు అస్వస్థత

జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో 100 మంది బాలీవుడ్ సినీ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులతో ఇబ్బందిపడ్డారు. దీంతో వారు ఆసుపత్రిలో చేరారు. ఆ వర్కర్ల ఆరోగ్యం స్థిరంగా ఉందని, కొందరిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.