ఈ నెల 30వ తేదీ వరకు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు
NLG: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతగల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వెబ్‌సైట్ telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.