కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలికి కడియం శుభాకాంక్షలు
HNK: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇటీవల నియామకం అయిన ఎర్రబెల్లి స్వర్ణకి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండలోని MLA నివాసంలో కడియంని స్వర్ణ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా MLA ఆమెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.