ప్రభుత్వ వాహనాలకు ఒకే సిరీస్ నంబర్లు
కేరళ ప్రభుత్వం ప్రభుత్వ వాహనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రేషన్ చేయించే వాహనాలకు KL90 సిరీస్ కేటాయించాలని నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాహనాలకు KL90A, KL90E, KL90B, స్థానిక సంస్థల వాహనాలకు KL90F, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, యూనివర్సిటీల వాహనాలకు KL90C సిరీస్‌లలో రిజిస్ట్రేషన్ చేయనున్నారు.