సంఘీగూడ సర్వీస్ రోడ్డు జలమయం

సంఘీగూడ సర్వీస్ రోడ్డు జలమయం

RR: రాత్రి కురిసిన భారీ వర్షానికి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సంఘీగూడ సర్వీస్ రోడ్డు పూర్తిగా జలమయమైంది. స్థానికులు వెంటనే డీఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని నీటిని క్లియర్ చేస్తున్నారు. చెరువుల ఆక్రమణల వల్లనే ఈ వరద వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.