జర్నలిస్టుల సమస్యలని పరిష్కరించాలి: TUWJ
ASF: జర్నలిస్టులు ఆనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడిలో జర్నలిస్టుల మహా ధర్నాకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. స్వరాష్ట్రంలో బతుకులు మెరుగు పడతాయని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.