ఓయూలో పగిలిన విగ్రహాలు.. సీసీ టీవీలో దృశ్యాలు

ఓయూలో పగిలిన విగ్రహాలు.. సీసీ టీవీలో దృశ్యాలు

HYD: ఓయూ క్యాంపస్‌లోని దుందుభి హాస్టల్‌లో సీతారాముల విగ్రహాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇటీవల రాములోరి కళ్యాణానికి తెచ్చిన విగ్రహాలను హాస్టల్ ఆవరణలో ఉంచారు. కాగా.. తెల్లవారుజామున విరిగి కనిపించాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు పరిశీలించగా గాలికి కింద పడినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ విషయంలో ఎవరి మీద నిందలు వద్దని పోలీసులు సూచిస్తున్నారు.