హూజుర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ మార్నింగ్ వాక్
NLG: హూజుర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని తన కార్యాలయం నుంచి రామస్వామి గట్టు వరకు కాలినడకన వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా BRSకు అనుకూలంగా జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలను పూర్తిస్థాయి ప్రజాస్వామ్య విధానంలో నిర్వహించిందని తెలిపారు.