బ్రాహ్మణ సేవా సమైక్య జాబ్ మేళా బ్రోచర్ విడుదల
ATP: బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 13న అమరావతి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు విడుదల చేశారు. ఈ మేళాకు దాదాపు 50కి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని, 10వ తరగతి నుంచి ఎమ్‌ఫార్మసీ వరకు చదివిన ఫ్రెషర్స్, అనుభవజ్ఞులు పాల్గొనవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.