అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం పురోగమించాలి: ఎమ్మెల్యే
కృష్ణా: అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం పురోగమించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా ఉగాది వేడుకల నిర్వాహణకు 1974లో ఆనంద నామ సంవత్సరంలో మండలి వెంకట కృష్ణారావు పునాది వేసి అఖిల భారత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారని తెలిపారు.