కొమ్మాల జాతర సందర్భంగా వాహనాల దారి మళ్లింపు
WGL: గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం 4వ తేదీ రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. WGL నుంచి నర్సంపేట వెళ్లే వాహనాలు మచ్చాపూర్, పల్లరిగూడ, చెన్నారావుపేట మీదుగా, నర్సంపేట నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు గిర్నిబావి, నాచనపల్లి, లక్ష్మీపురం, ఎల్కుర్తి, మచ్చాపూర్ మీదుగా ప్రయాణించాలని సూచించారు.