రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నేస్తాలుగా రైతు సేవా కేంద్రాలు వ్యవహరించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.