సమాజాన్ని డ్రగ్స్ ముప్పు నుంచి రక్షించాలి: సీఎండీ
BDK: సమాజాన్ని డ్రగ్ ముప్పు నుండి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ మంగళవారం పిలుపునిచ్చారు. యువతలో పెరుగుతున్న డ్రగ్ వినియోగాన్ని అరికట్టేందుకు అందరూ తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, మాదక ద్రవ్యాలకు బానిసైతే దేశ అభివృద్ధికి పెను విఘాతం కలుగుతుందని వెల్లడించారు.