జానపద కళలను ఆదరించాలి

VZM: అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించి, ఉపాధి అవకాశాలను కల్పించాలని జానపద కళా పీఠం అధ్యక్షులు బద్రి కూర్మారావు శనివారం కోరారు. విజయనగరం స్థానిక కోట ప్రాంగణంలో జిల్లా కళాకారులు ఎస్. చిన్న రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 50 ఏళ్లు దాటిన కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కళాకారులు పి.సురేష్ పాల్గొన్నారు.