‘కోటి దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమం’
TG: కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అద్భుతమైనదిగా భావిస్తోందని Dy CM భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారని, జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. శతాబ్దాల ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు.