ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SRD: మానూర్ మండలం మైకోడ్ గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం బీజేపీ నాయకులు చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్ణం ఈశ్వరప్ప జెండాను ఆవిష్కరించి, భారతమాత, వాజ్‌పేయ్ చిత్రపటాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.